
తమిళ నటుడు, పొలిటీషియన్ ఉదయనిధి స్టాలిన్ సినిమాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'మామన్నన్' చిత్రమే చివరి సినిమా అని తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రకటించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫజల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఉదరు..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడని తెలిసిందే.