Jan 25,2022 21:40

జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న హౌసింగ్‌ డిఇ వరప్రసాద్‌

            ఉరవకొండరూరల్‌ : జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఉరవకొండ హౌసింగ్‌ డిఇ వరప్రసాద్‌ సంబంధిత అధికారు లను ఆదేశించారు. మంగళవారం విడపనకల్‌ మండల పరిధిలోని గడేకల్‌ గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా జగనన్న కాలనీ లేఅవుట్లతోపాటు సొంతంగా నిర్మించుకు ంటున్న ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రభు త్వ నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సిమెంట్‌, ఇసుక పంపిణీతో పాటు బిల్లుల మంజూరులో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీలైనంత మేరకు హౌసింగ్‌ అధికారులు లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఎఇ అనిల్‌, వైస్‌ ఎంపిపి పుష్పావతి, మాజీ సర్పంచులు మేకల పంపాపతి, భీమిరెడ్డి, హౌసింగ్‌ వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు రత్నం, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు మనీషా, శివ, వైసిపి నాయకులు హేమంత్‌, భీమేష్‌, రాము తదితరులు పాల్గొన్నారు.