Jun 11,2021 22:10

mylavaram lo nirasana

ఇళ్లు కట్టుకోవటానికి అడ్డంకులు ఎందుకో : సిపిఎం
మైలవరం : ఇళ్ళ పట్టాలు ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇళ్ళు కట్టుకుంటుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో అధికారులు సమాధానం చెప్పాలని సీపీఎం మండల అర్గనైజింగ్‌ సెక్రటరీ చాట్ల సుధాకర్‌ ప్రశ్నించారు. అయ్యప్ప నగర్‌ వద్ద 372 మందిని అర్హులుగా గుర్తించి గతంలో పట్టాలు ఇచ్చారని నేటి ప్రభుత్వం వాటిని కొనసాగించకుండా అవకతవకలు జరిగాయని ఓరిజినల్‌ పట్టాలు ఇస్తామని చెప్పి రెండు ఏళ్ళు గడుస్తున్ననేటికి అయ్యప్పనగర్‌ స్థలాల గురించి స్పష్టత ఇవ్వకపోవడం విడ్డురంగా ఉందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి అర్హులైన వారికి ఇళ్ళు నిర్మించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటీ తహశీల్ధార్‌ శ్రీహరి లబ్దిదారులతో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈకార్యక్రమంలో లబ్దిదారులైన మహిళలు పాల్గొన్నారు.