Oct 17,2020 22:42
మెగా రిటైల్‌ అండ్‌ క్రెడిట్‌ క్యాంప్‌లో రుణాలు జారీ చేస్తున్న ఇండియన్‌ బ్యాంక్‌ ఉన్నతాధికారులు

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ రిటైల్‌, ఎంఎస్‌ఎంఇ వ్యాపారులకు రుణ మద్దతును అందించడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నగరంలోని బేగంపేటలోని తమ కార్యాలయంలో ప్రత్యేక రిటైల్‌, ఎంఎస్‌ఎంఇ క్రెడిట్‌ క్యాంపెయిన్‌ను నిర్వహించినట్లు ఆ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో గృహ, వాహన, విద్యా రుణాలకు సంబంధించిన 50 మందికి దాదాపుగా రూ.15.65 కోట్ల రిటైల్‌ రుణాలు అందించారు. అదే విధంగా 21 ఎంఎస్‌ఎంఇలకు రూ.17.60 కోట్ల రుణాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ బ్యాంక్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎకె మోహపాత్ర, జోనల్‌ మేనేజర్‌ ఎంబి సురేష్‌ కుమార్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ మోహపాత్ర, ఆర్‌ఎంపిసి హెడ్‌ ఎస్‌ఎల్‌ఎన్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గన్నారు.