May 03,2021 20:09

నటుడు వరుణ్‌ సందేశ్‌ కొన్ని పరాజయాల తర్వాత ఎం.ఎస్‌.ఆర్‌ దర్శకత్వంలో 'ఇందువదన' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫర్నాజ్‌ శెట్టి కథానాయిక నటిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం సోమవారం నాడు విడుదల చేసింది. వరుణ్‌ సందేశ్‌ ఓ కళాకారుడిలా నటుడు శోభన్‌ బాబు తలకట్టుతో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ ఇప్పటికే మొదలు అయ్యింది. ఈ సినిమాను ఈ సంవత్సరం విడుదల చేసేలా నిర్మాత మాధవి ఆదుర్తి ప్లాన్‌ చేస్తున్నారు.