May 12,2022 21:14

లండన్‌: ఇంగ్లండ్‌ పురుషుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ జట్టు మాజీ ఓపెనర్‌ మెక్‌ కల్లామ్‌ నియమింపబడ్డాడు. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కోచ్‌గా ఉన్న కల్లామ్‌ జూన్‌ నుంచి ఇంగ్లండ్‌ జట్టు కోచ్‌తో బాధ్యతలు స్వీకరించనున్నాడు. జూన్‌-2నుంచి లార్డ్స్‌ వేదికగా మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఘోర పరాభవం నేపథ్యంలో కొత్త కోచ్‌ వేటలో ఇంగ్లండ్‌ావేల్స్‌ క్రికెట్‌ బోర్డు దృష్టి సారించాయి. 40ఏళ్ల క్రిస్‌ సిల్వర్‌ వుడ్‌, సహాయ కోచ్‌గా ఆండ్రూ స్టాస్‌ నియమింపబడినట్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌ తరఫున మెక్‌కల్లామ్‌ 101 టెస్టుల్లో 6,400పరుగులు చేశాడు. టెస్టుల్లో 107 సిక్సర్లు కొట్టినే ఏకైక బ్యాటర్‌ మెక్‌కల్లామ్‌ మాత్రమే.