Aug 18,2022 23:11

ఎంఇఒకు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు స్థానిక ఎంఇఒ కెఎ.బాలామణికి గురువారం సాయంత్రం వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, ఎండిఎంకు సంబందించిన వివరాలు అప్‌ లోడ్‌ చేయుటకు ఇటీవల పాఠశాల విద్యా శాఖ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ను రద్దుచేయాలని కోరారు. సంబంధిత వివరాలు సొంత ఫోన్లలో డౌన్‌ లోడ్‌ చేయడం వల్ల వ్యక్తి గత సమాచారానికి భద్రత ఉండదని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే, తమతో పాటు విద్యార్థుల హాజరు నమోదు చేయగలమని స్పష్టం చేశారు. మిగిలిన వివరాల అప్‌ లోడింగ్‌ బాధ్యతను తప్పించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు అనకాపల్లి పైడిరాజు, మండల అధ్యక్షులు ఊడికల రాంబాబు, నాయకులు శ్రీను తదితరులు ఉన్నారు.