
మద్దెమ్మకు పింఛన్ అందజేస్తున్న వాలంటీర్ జయలక్ష్మి
మడకశిర:ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స పొంది ఇతర ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటున్న ఓ మహిళకు వాలంటీర్ వారి ఇంటికెళ్లి పింఛన్‌ను అందజేసింది. రొళ్ల మండలం సోమగట్ట గ్రామానికి చెందిన మద్దెమ్మ గుండె శస్త్రచికిత్స చేయించుకుని మడకశిరలోని తన కుమారుడు ఆనంద్ ఇంట్లో ఉంటోంది. ఈ మహిళకు వాలంటీర్ జయలక్ష్మి మడకశిరకు వెళ్లి పింఛన్ అందజేసింది. వాలంటీర్ సేవలను పలువురు అభినందించారు.