May 14,2022 10:55

పోలిపల్లి (విజయనగరం) : ఇంటర్మీడియట్‌ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి పోలిపల్లిలో చోటుచేసుకుంది. విద్యార్థి తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భోగాపురం పిహెచ్‌సికి తరలించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.