Nov 26,2021 10:47

హైదరాబాద్‌ : నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాలను ఎంపిక చేసుకోవడంలో వేగం పెంచారు. ఇప్పటికే రెండు ద్వి భాషా చిత్రాలను చేతిలో ఉండగా.. ఇప్పుడు గ్లోబల్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 'ది అరెంజ్‌మెంట్‌ ఆఫ్‌ లవ్‌' పేరుతో తెరకెక్కబోతున్న ఈ మూవీని అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ ఫిలిప్‌ జాన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గురు ఫిలింస్‌ బ్యానర్‌పై సునీత తాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత అను అనే పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. 'ఓ సరికొత్త ప్రపంచం. 'అరెంజ్‌మెంట్‌ ఆఫ్‌ లవ్‌'లో భాగం కావడాన్ని థ్రిల్‌గా ఫీల్‌ అవుతున్నాను. అను అనే పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్నందుకు దర్శకుడు పిలిప్‌ జాన్‌కు ధన్యవాదాలు'' అని తెలిపారు సమంత. కాగా, శాకుంతలం, తమిళంలో కాతు వకుల రెండు కాదల్‌ సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

సమంత