
- భారత్‌లో పరిస్థితిపై ఆస్ట్రేలియా శాసనకర్తల ఆగ్రహం
- కాన్‌బెర్రాలో బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శన
కాన్‌బెర్రా : సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రధానితో భారత్, ప్రధానినరేంద్ర మోడీ చర్చలు జరిపిన రోజే కాన్‌బెర్రాలోని పార్లమెంట్ హౌస్‌లో బిబిసి డాక్యుమెంటరీని ప్రదర్శించారు. 2002 గుజరాత్ హింసాకాండలో మోడీ ప్రమేయంపై బిబిసి ఈ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. పలువురు శాసనకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నలభై నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించిన అనంతరం చర్చా గోష్టి నిర్వహించారు. ఇందులో గ్రీన్స్ సెనెటర్లు జోర్డాన్ స్టీల్‌జాన్, డేవిడ్ షోబ్రిడ్జ్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కుమార్తె ఆకాషీ భట్, దక్షిణాసియా సంఘీభావ గ్రూప్‌కు చెందిన డాక్టర్ కల్పనా విల్సన్ తదితరులు పాల్గనాురు.
భారత్‌లో నిజం మాట్లాడడం నేరమని సెనెటర్ డేవిడ్ షోబ్రిడ్జ్ వ్యాఖ్యానించారు. డాక్యుమెంటరీని ప్రదర్శించిన వారిని, చూసిన వారిని అధికారులు ఎనోు ఇబ్బందులు పెట్టారనిఆయన తెలిపారు. 'భారతదేశంలో నివసిస్తున్న ఆస్ట్రేలియా వారితో నేను మాట్లాడాను. ఏం జరుగుతోందో చెప్పేందుకే వారు భయపడ్డారు. తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చినా ముప్పు తప్పదనిచెప్పారు. తమ కోసం ఏమైనా చేయాలని వారు ఆస్ట్రేలియా ప్రధానిని, ఇతర రాజకీయ నాయకులను కోరుతునాురు' అనిఆయన వివరించారు. గుజరాత్ రాష్ట్రం కొనిు నెలల పాటు అగిుగుండంలా మండిపోయిందని, ముస్లింలపై నిర్దాక్షిణ్యంగా దమనకాండ సాగించారనిఆకాషీ భట్ చెప్పారు. ఈ ప్రాంతంలోని ప్రజాస్వామిక దేశాలకు హిందూత్వ సిద్ధాంతం ముప్పుగా పరిణమించిందని మస్సే యూనివర్సిటీకి చెందిన మోహన్ దత్తా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో క్షీణిస్తును మానవ హక్కుల పరిస్థితిపై మోడీతో ఆస్ట్రేలియా ప్రధానిచర్చించకపోవడం దురదృష్టకరమని జోర్డాన్ స్టీల్‌జాన్ చెప్పారు. తమ ప్రధాని వైఖరి ఆగ్రహానిు కలిగిస్తోందని ఆయన అనాురు. మోడీతో తమ ప్రధాని, విదేశాంగ మంత్రి నిక్కచ్చిగా మాట్లాడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పశ్చిమ దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తునాుయంటూ మోడీ మాట్లాడుతునాురని, తన రాజకీయ లబ్ది కోసమే ఆయన ఈ వ్యూహానిు ఎంచుకునాురని విమర్శించారు. 'ఆకాషీ చెప్పిన మాటను పరిశీలిస్తే అక్కడ చట్టం ఏ విధంగా అమలవుతోందో అర్థమవుతుంది. తన కుటుంబం నివసిస్తును ఇంటిని ధ్వంసం చేశారని ఆకాషీ చెప్పారు. ఆ విషయంపై మోడీనిమా ప్రధానిప్రశిుస్తే బాగుండేది. అసలు ఇలాంటి విషయాలు చర్చల అజెండాలో లేనప్పుడు మోడీనిమా ప్రధాని ఎలా కలుసుకుంటారు? ఇది నాయకత్వ లోపమే' అని డేవిడ్ షోబ్రిడ్జ్ మండిపడ్డారు.