
ఢిల్లీ: ఈనెల 24న గూగుల్ తన సర్వీసు ప్లే మ్యూజిక్‌ను డిలీట్ చేయనుంది. ఈమేరకు ఇప్పటికే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వాడుతున్న వారికి కొన్ని రిమైండర్లు కూడా పంపుతోంది. ఇందులో భాగంగా గూగుల్ ప్లే మ్యూజిక్‌లో ఉన్న లైబ్రరీ, డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తామని గూగుల్ తెలిపింది. మళ్లీ రికవర్ చేయడానికి వీలు ఉండదని స్పష్టం చేసింది. అలాగే కస్టమర్లను ఇప్పటికే ప్లే మ్యూజిక్ నుండి యూట్యూబ్ మ్యూజిక్కు మార్చింది. ఇప్పటికీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశముందని పేర్కొంది. ఫిబ్రవరి 24 లోపు గూగుల్ టేక్ అవుట్ నుండి చేసుకోవచ్చని గూగుల్ చెప్పింది. గతేడాది డిసెంబర్లోనే గూగుల్ ప్లే మ్యూజిక్ ఆపరేషన్లను నిలిపివేసింది. దీనిని యూట్యూబ్ మ్యూజిక్‌గా మార్చింది.