Oct 13,2021 20:37

కొత్తగా 45వేల ఉద్యోగాలు
బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 11.9 శాతం వృద్థితో రూ.5,428 కోట్ల నికర లాభాలు సాధించింది. రెవెన్యూ 20 శాతం పెరిగి రూ.29,602 కోట్లకు చేరింది. తమ డిజిటల్‌ ఆఫరింగ్స్‌ బలమైన వద్థికి మద్దతు చేశాయని ఆ కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 45వేల కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇంతక్రితం ఈ లక్ష్యం 35వేలుగా ఉందని పేర్కొంది. బుధవారం బిఎస్‌ఇలో ఆ కంపెనీ షేరు 1.42 శాతం పెరిగి రూ.1,708.75 వద్ద ముగిసింది.