
విశాఖపట్నం : భారత్-ఆస్ట్రేలియా మధ్య విశాఖలో జరగాల్సిన రెండో వన్డేకు వర్షం అడ్డంకి తొలగేలా కనిపించడం లేదు. మ్యాచ్ జరగనున్న ఏసీఏ-వీడీసీఏ మైదానం సహా నగరంలోని పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం ఆగితే మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు.. మైదానాన్ని సిద్ధం చేసేందుకు వీలుంటుంది. ఓవర్లు కొంత కుదించి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఒకవేళ వర్షం ఆగక పోతే పరిస్థితి ఏమిటా అని ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.