
- రోహిత్, శుభ్‌మన్ సెంచరీలు
- న్యూజిలాండ్‌పై 90పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
ఇండోర్: చివరి వన్డేలోనూ భారత్ గెలిచి 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 386పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు 41.2ఓవర్లలో 295పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్ శర్మ(101), శుభ్‌మన్(112) తొలి వికెట్‌కు 212 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(54), కోహ్లీ(36), శార్దూల్ ఠాకూర్(25) ఫర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నెర్‌కు మూడేసి, బ్రాస్‌వెల్‌కు ఒక వికెట్ దక్కాయి. ఛేదనలో న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫిన్ డకౌటైనా.. మరో ఓపెనర్ కాన్వే(138) బ్యాటింగ్‌లో రాణించాడు. నికోల్స్(42), సాంట్నర్(32) ఫర్వాలేదనిపించారు. శార్దూల్, కుల్దీప్కు మూడేసి, చాహల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ శుభ్‌మన్ గిల్‌కు లభించింది. ఇక ఇరుజట్ల మధ్య మూడు టి20ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
Shubman Gill's glorious form in ODI cricket continues 🔥#INDvNZ | 📝: https://t.co/xoiYn9WEgR pic.twitter.com/XObdobmfQf
— ICC (@ICC) January 24, 2023
- బాబర్ రికార్డును సమం చేసిన శుభ్‌మన్
టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ రికార్డును సమం చేశాడు. 23ఏళ్ల శుభ్‌మన్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో బాబర్ అజామ్ పేరిట ఉన్న 360(3మ్యాచ్‌ల్లో) పరుగుల రికార్డును సమం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 208, 40, 112 పరుగులు చేశాడు. దీంతో బాబర్ రికార్డును సమం చేశాడు. ఇక భారత్‌లో తరపున మూడు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 283 పరుగులు మూడు వన్డేల్లో. ఆ రికార్డును శుభ్‌మన్ బ్రేక్ చేశాడు.
.@imShard scalped 3️⃣ crucial wickets with the ball when the going got tough and bagged the Player of the Match award as #TeamIndia registered a 90-run victory in the final #INDvNZ ODI 👏🏻👏🏻
— BCCI (@BCCI) January 24, 2023
Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…@mastercardindia pic.twitter.com/cpKbBMOTll
స్కోర్‌బోర్డు..
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి)బ్రాస్‌వెల్ 101, శుభ్‌మన్ (సి)కాన్వే (బి)టిక్నెర్ 112, కోహ్లి (సి)అలెన్ (బి)డఫీ 36, ఇషాన్ (రనౌట్) నికోల్స్ 17, సూర్యకుమార్ (సి)కాన్వే (బి)డఫీ 14, హార్దిక్ (సి)కాన్వే (బి)డఫీ 54, సుందర్ (సి)మిఛెల్ (బి)టిక్నెర్ 9, శార్దూల్ (సి)లాథమ్ (బి)టిక్నెర్ 25, కుల్దీప్ (రనౌట్) లాథమ్/ఫెర్గుసన్ 3, ఉమ్రన్ (నాటౌట్) 2, అదనం 12. (50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 385పరుగులు.
వికెట్ల పతనం: 1/212, 2/230, 3/268, 4/284, 5/293, 6/313, 7/367, 8/379/, 9/385
బౌలింగ్: డఫీ 10-0-100-3, ఫెర్గుసన్ 10-1-53-0, టిక్నెర్ 10-0-76-3, సాంట్నర్ 10-0-58-0, మిఛెల్ 4-0-41-0, బ్రాస్‌వెల్ 6-0-51-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: ఫిన్ (బి)హార్దిక్ 0, కాన్వే (సి)రోహిత్ (బి)ఉమ్రన్ 138, నికోల్స్ (ఎల్బి)కుల్దీప్ 42, మిఛెల్ (సి)ఇషాన్ (బి)శార్దూల్ 24, లాథమ్ (సి)హార్దిక్ (బి)శార్దూల్ 0, ఫిలిప్స్ (సి)కోహ్లి (బి)శార్దూల్ 5, బ్రాస్‌వెల్ (స్టంప్)ఇషాన్ (బి)కుల్దీప్ 26, సాంట్నర్ (సి)కోహ్లి (బి)చాహల్ 34, ఫెర్గుసన్ (సి)రోహిత్ (బి)కుల్దీప్ 7, డఫీ (ఎల్బి)చాహల్ 0, టిక్నెర్ (నాటౌట్) 0, అదనం 19. (41.2ఓవర్లలో ఆలౌట్) 295పరుగులు.
STUMPED!
— BCCI (@BCCI) January 24, 2023
A fine work behind the stumps from @ishankishan51 👍 👍@imkuldeep18 scalps his second wicket 👏 👏
Follow the match ▶️ https://t.co/ojTz5RqWZf#TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/P5zrVNNyNv
వికెట్ల పతనం: 1/0, 2/106, 3/184, 4/184, 5/200, 6/230, 7/269, 8/279, 9/280, 10/295
బౌలింగ్: హార్దిక్ 6-0-37-1, సుందర్ 6-0-49-0, శార్దూల్ 6-0-45-3, ఉమ్రన్ 7-0-52-1, కుల్దీప్ 9-0-62-3, చాహల్ 7.2-0-43-2.