Nov 25,2021 09:17

కాన్పూర్‌: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. రెండు బౌండరీలతో ఆడుతోన్న మయాంక్ అగర్వాల్ 13 పరుగుల వద్ద బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్‌ ఆడుతూ టీమిండియాకు మంచి స్కోర్‌ను అందించేందుకు తన వంతు సహాయపడ్డాడు. 79 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌ సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇది శుభ్మన్‌కు 4వ టెస్ట్ ఫిఫ్టీ. అలాగే పుజరాతో కలిసి రెండో వికెట్‌కు 111 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతం 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది.

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో కాన్పూర్ లోని గ్రీన్ పార్కులో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ అజింక్య రహానె తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీనికి ముందు జరిగిన టి20 మ్యాచులలో 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 2 టెస్టు సిరీస్ గల ఈ మ్యాచులలో ఎలాగైనా గెలుపొంది ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది. మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత ప్రధాన ఆటగాళ్లు కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, బుమ్రా, షమి ఎవరూ ఆడట్లేదు. దీంతో రహానె సారథ్య బాధ్యతలు చేపట్టాడు. రెండో టెస్టులో కోహ్లి ఆడనున్నారు. ఇరు జట్లూ చివరిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడగా అప్పుడు న్యూజిలాండ్‌ విజయం సాధించింది.
భారత్‌: మయాంక్‌, శుభ్‌మన్‌, పుజార, రహానె, శ్రేయస్‌, జడేజా, సాహా, అశ్విన్‌, అక్షర్‌, సిరాజ్‌/ఇషాంత్‌, ఉమేశ్‌.
న్యూజిలాండ్‌: లేథమ్‌, విల్‌ యంగ్‌, విలియమ్సన్‌, టేలర్‌, నికోల్స్‌, బ్లండెల్‌, శాంట్నర్‌/జేమీసన్‌, సౌథీ, వాగ్నర్‌, విల్‌, అజాజ్‌ పటేల్‌.