Oct 18,2020 22:21

బురదమయంగా మారిన రైతుబజారు ఆవరణ

ప్రజాశక్తి- మండపేట
కొద్దిపాటి వర్షానికే స్థానిక రైతు బజారు ఆవరణం బురదమయంగా మారుతోంది. దీంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్‌ నిబంధనల మేరకు అధికారులు వాక్‌ట్రాక్‌ను మూసివేయ డంతో వర్షంలో తడుస్తు బురదలో నడుస్తు కొనుగోలుదారులు కూరగాయలను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాగైతే రోగాల బారిన పడక తప్పదని వారంటున్నారు. అనేక మార్లు అధికారులకు సమ స్యను విన్నవించు కున్నా ఫలితం లేకపోయిందని, ఇప్పటికైనా స్పందించాలని వినియోగదారులు కోరుతున్నారు.