Nov 25,2020 22:44

మాట్లాడుతున్న ఎఒ ఇ.ఫాతిమా

ప్రజాశక్తి-పర్చూరు: ఎరువుల నియంత్రణ చట్టాన్ని అతిక్రమించి వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పర్చూరు మండల వ్యవసాయ అధికారి ఇ.ఫాతిమా ఎరువులు, పురుగుమందుల డీలర్లను హెచ్చరించారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో బుధవారం ఎరువులు, పురుగుమందుల డీలర్లతో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. పురుగుమందులు, ఎరువులను ఎంఆర్‌పి ధర కంటే ఎక్కువ, తక్కువ ధరలకు అమ్మినా నేరమని అన్నారు. ఒక మెట్రిక్‌ టన్ను కంటే అధికంగా ఎరువులను విక్రయించిన రైతుల వద్ద నుంచి ధ్రువీకరణపత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని డీలర్లకు సూచించారు. సమావేశంలో డివిజన్‌లోని డీలర్లు పాల్గొన్నారు.