Nov 25,2020 22:45

వీడియోకాన్ఫరెన్స్‌ పాల్గొన్న కలెక్టర్‌ భాస్కర్‌

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌తో జిల్లాలో చేపట్టిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ప్రహరీలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు నిర్ధేశించిన కాలపరిమితిలో పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కలెక్టర్‌ పోల భాస్కర్‌ వివరించారు. వెలగపూడి సచివాలయం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులపై మంత్రి జిల్లా కలెక్టర్లు, డ్వామా, పంచాయతీరాజ్‌, ఐసిడిఎస్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ నవంబర్‌ వరకూ లేబర్‌ బడ్జెట్‌లో రూ.237.56 లక్షలు లక్ష్యం కాగా 239.67 లక్షలు జనరేట్‌ చేశామన్నారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌లో రూ.414.29 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉండగా, 203.14 లక్షలు ఖర్చు పెట్టామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శీనారెడ్డి, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇలు కొండయ్య, సంజీవ రెడ్డి, డిఐసి జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖరరావు, డ్వామా ఏపీడీ వెంకట్రామిరెడ్డి ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మీదేవి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.