Nov 25,2020 22:42

పనులను పరిశీలిస్తున్న జైళ్ల శాఖ డిజి

ప్రజాశక్తి -కనిగిరి: ప్రతి జిల్లాకు ఓ కోవిడ్‌ జైలును కేటాయించినట్లు జైళ్ల శాఖ డిజి హసన్‌రాజా తెలిపారు. కనిగిరిలో నిర్మిస్తున్న సబ్‌జైలు నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జైళ్ల శాఖ పరిధిలో 81 జైళ్లు ఉన్నాయని తెలిపారు. అందులో రూ.1.20కోట్ల నిధులతో కనిగిరిలో నిర్మించే సబ్‌జైలు పనులు పూర్తికావచ్చాయని అన్నారు. త్వరలో ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐజి జయవర్ధన్‌, డిఐజి వరప్రసాద్‌, డిఎస్‌పి వెంకటరెడ్డి, కనిగిరి సిఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ జి.రామిరెడ్డిలు పాల్గొన్నారు.