Nov 25,2020 22:41

ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఎఒ రవికుమార్‌

ప్రజాశక్తి-లింగసముద్రం: మండలంలోని గ్రామాల్లో పంటలు సాగుచేసిన రైతులు రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని మండల ఎఒ బి.రవికుమార్‌ సూచించారు. బుధవారం ఆయన రాళ్లపాడు ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివర్‌ తుపాను ప్రభావం మండలంపై ఉంటుందని అన్నారు. పొలాల్లో మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.