Nov 25,2020 22:48

రేషన్‌ దుకాణాల్లో తనిఖీ చేస్తున్న జిల్లా సివిల్‌సప్లై అధికారి పి. సురేష్‌


ఒంగోలు క్రైం : సర్వర్‌ సమస్య పరిష్కారమైనట్లు జిల్లా సివిల్‌సప్లై అధికారి పి. సురేష్‌ తెలిపారు. లబ్ధిదారులు దుకాణాలకు వెళ్లి రేషన్‌ సరుకులు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ప్రకాశం కాలనీ, దేవుడుచెరువు, సంతపేట ప్రాంతాల్లోని రేషన్‌ దుకాణాలు బుధవారం ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వర్‌ సమస్య కారణంగా రేషన్‌ కార్డుదారులు ఇక్కట్లకు గురవుతున్నట్లు తెలిపారు. సమస్యను జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. స్పందించిన జేసీ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ ఊతకోలు శ్రీనివాసరావు పాల్గొన్నారు