
మార్టూరు రూరల్ (ప్రకాశం): ఆగి వున్న లారీని, కారు ఢకొీన్న ఘటనలో మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మార్టూరు సమీపంలో జగద్గురు స్పిన్నింగ్ మిల్లు ఎదురుగా జాతీయరహదారిపై చోటుచేసుకుంది. గుంటూరు వైపు నుండి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.