శ్రీవల్లి పది సంవత్సరాల పిల్ల. ఆ వీధిలో ఓ పాకలో నివసిస్తోంది. తన చుట్టూ అన్నీ పెద్ద భవంతులే. వాళ్ళ ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది సరస్వతమ్మ.
చిలుకా, కాకీ బూరుగు చెట్టు పైకొమ్మన ఒకటి, కింద కొమ్మన ఒకటి గూళ్లు కట్టుకున్నాయి. కొంతకాలానికి కాకమ్మ అయిదు గుడ్లు పొదిగింది. కానీ వాటిలో రెండు మాత్రమే పిల్లలయ్యాయి.