Oct 24,2020 20:55

ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న ఒఎస్‌డి సూర్యచంద్రరావు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : జిల్లాలోని ఏజెన్సీలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ఒఎస్‌డి సూర్యచంద్రరావు అన్నారు. శనివారం ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో మావోయిస్టుల ప్రభావం లేనప్ప టికీ ఒడిశాలో అక్కడ వారి కార్యకలాపాలు కొనసాగుతు న్నాయన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఫ్రెండ్లీ పోలీ సింగ్‌ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన గిరి జన గ్రామాలను గుర్తించి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ న్నారు. అటవీశాఖ అనుమతులతో గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకుం టామని చెప్పారు. ప్రతి గ్రామానికి సమాచార వ్యవస్థ అందుబాటులో ఉండేలా సెల్‌ఫోన్‌ టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
కలిగొట్టులో దుప్పట్లు, గొడుగులు పంపిణీ
మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ కలిగొట్టును ఒఎస్‌డి సూర్యచంద్రరావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో 15 మంది గిరిజనులకు దుప్పట్లు, మరో 15 మందికి గొడుగులను పంపిణీ చేశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎల్విన్‌పేట సిఐ రమేష్‌కుమార్‌, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌, ట్రైనింగ్‌ ఎస్‌ఐ రంభ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.