Nov 25,2020 22:43

మాట్లాడుతున్న ఆర్‌జెడి రవీంద్రనాథ్‌రెడ్డి

ప్రజాశక్తి-కనిగిరి: జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ నూరు శాతం పూర్తి చేయాలని ఆర్‌జెడి రవీంద్రనాధ్‌రెడ్డి అన్నారు. బుధవారం కనిగిరి పట్టణంలోని జిల్లాపరిషత్‌ బాలికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. కిట్ల పంపిణీ గురించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 10 వరకు 3,30,214 విద్యార్థులు ఉన్నారు. వారందరికీ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకుగానూ తల్లిదండ్రులు బయోమెట్రిక్‌ చేయించాలని అన్నారు. 61 శాతం మాత్రమే బయోమెట్రిక్‌ చేశారని అన్నారు. మిగిలిన శాతాన్ని త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. శనివారంలోగా నూరుశాతం చేయించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం పాఠశాలలో అగ్నిప్రమాదాలు, విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపకశాఖ అధికారులు మాక్‌డ్రిల్‌ నిర్వహించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎ సిఎంఒ రాజాల కొండారెడ్డి, హెచ్‌ఎంలు డి.రామిరెడ్డి, భారతీదేవి, ఎస్‌ఎఫ్‌ఒ ఆర్‌.రామకృష్ణ,ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.