Nov 25,2022 14:56

న్యూఢిల్లీ   :   ఇండో- పసిఫిక్‌ ప్రాంతం ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ సమాజ ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండో - పసిఫిక్‌ రీజనల్‌ డైలాగ్‌ -2022లో ప్రసంగించారు. అన్ని దేశాలు విజయం సాధించే పరిస్థితిని కల్పించేందుకు కృషి చేయాలని చెప్పారు. దీర్ఘకాల లాభదాయకం, స్వప్రయోజనాల కోసం భారత్‌ మార్గనిర్దేశం చేయబోదని అన్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతమంతా మానవత్వమనే సందేశాన్ని పంపేందుకు భారత్‌తో అనుసంధానించాల్సి ఉందని అన్నారు. భాగస్వామ్య శ్రేయస్సు, భద్రత దృష్ట్యా ఈ ప్రాంతంలో ఆసియన్‌ దేశాల ప్రాధాన్యతను భారత్‌ పునరుద్ఘాటిస్తుందని అన్నారు. ఇప్పుడు యుద్ధానికి సమయం కాదని ఇటీవలి జి20 సదస్సులో ప్రధాని మోడీ దేశాధినేతలకు దృఢమైన సందేశాన్ని పంపారని అన్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచే దిశగా సముద్రంలో ప్లాస్టిక్‌ కాలుష్య నిర్వహణకు ఆసియాదేశాలతో పాటు భారత్‌ కూడా చొరవ చూపాలని ప్రదిపాదించినట్ల తెలిపారు.