
- న్యూజిలాండ్‌తో మూడో వన్డే నేడు
- మధ్యాహ్నం 1.30గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
ఇండోర్: వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా ఇక క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగే మూడో వన్డేలోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 300కు పైగా పరుగులు చేసినా.. చివరి ఓవర్లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. హోల్డర్ స్టేడియంలో జరిగే మూడో వన్డేలోనూ న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో ముగించాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేలో డబుల్ సెంచరీతోపాటు రెండో వన్డేలోనూ బ్యాటింగ్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి నెలకొంది. పేసర్లు షమీ, సిరాజ్‌తోపాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో అలరిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో బ్రాస్‌వెల్, సాంట్నర్ మాత్రమే రాణిస్తున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.
జట్లు(అంచనా):
భారత్: రోహిత్(కెప్టెన్), హార్దిక్(వైస్ కెప్టెన్), ఇషాన్(వికెట్ కీపర్), కోహ్లి, శుభ్‌మన్, సూర్యకుమార్, కుల్దీప్, షమీ, సిరాజ్, శార్దూల్, సుందర్.
న్యూజిలాండ్: లాథమ్(కెప్టెన్, వికెట్ కీపర్), అలెన్, బ్రాస్‌వెల్, కాన్వే, ఫెర్గుసన్, మిఛెల్, నికోలస్, ఫిలిప్స్, సాంట్నర్, షిప్లే, టిక్నెర్.