Nov 25,2022 21:23

న్యూయార్క్‌ : అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రవాదమనేది తీవ్ర ముప్పుగా పరిణమించిదని ఐక్యరాజ్య సమితిలో భారత్‌ శాశ్వత ప్రతినిధి రుచిర కాంభోజ్‌ వ్యాఖ్యానించారు. ఐసిస్‌, అల్‌ఖైదా అనుంబంధ సంస్థలు ప్రత్యేకించి ఆసియా, ఆఫ్రికాల్లో పౌరులను, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తునాుయని అనాురు. ముంబయి తీవ్రవాద దాడులకు పాల్పడ్డవారిని విచారించేందుకు భారత్‌ చేసే యత్నాలు కొన్ని రాజకీయ కారణాల వల్ల గతంలో నిలువరించబడ్డాయని, దానివల్ల వారు మరింతగా రెచ్చిపోయి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే తీవ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకుభారత్‌ చేసే ప్రయతాులను చైనా పదే పదే నిలువరించడానిు ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. ముంబయి దాడులు జరిగి శనివారానికి 14ఏళ్లు పూర్తవుతును నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు వెలువడ్డాయి.