Oct 02,2022 11:43

జకార్తా :   ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది.  ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది మరణించగా, 180 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.   తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన  ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.  అరెమా ఎఫ్‌సి, పెర్సబయ సురబయ మధ్య జరిగిన మ్యాచ్‌లో అరెమా జట్టు ఓడిపోయింది.  ఓడిపోయన జట్టు అభిమానులు ఆగ్రహంతో  పిచ్‌లోకి చొరబడ్డారు. పోలీస్‌ వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని, దీంతో తొక్కిసలాట జరిగినట్లు ఈస్ట్‌ జావా పోలీస్‌ చీఫ్‌ నికో అఫింటా విలేకరులతో తెలిపారు.   ఈ ఘటనపై ఇండోనేషియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ దర్యాప్తునకు ఆదేశించింది.

 

;