Oct 02,2022 21:14
  • జూనియర్‌ కళాశాలలకు ఇంటర్‌ బోర్డు హెచ్చరిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలను ఇంటర్మీడియట్‌ బోర్డు స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించి తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ నెల 2 నుంచి 9 వరకు దసరా సెలవులు ఉంటాయను విషయాన్ని ప్రయివేటు జూనియర్‌ కళాశాలలకు ఇప్పటికే విడుదల చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌లో పొందుపరిచిన్నట్లు తెలిపారు. సెలవుల రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్‌పైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారులు కళాశాలలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.