Sep 15,2021 08:50

శాన్‌ఫ్రాన్సిస్కో :  సరికొత్త 5జి ఐఫోన్‌ 13 సిరీస్‌ను యాపిల్‌ ఆవిష్కరించింది. కొత్తగా గులాబీ రంగులోనూ వీటిని తీసుకొచ్చింది. కెమెరా లెన్స్‌లను ఐ మూలగా ఏర్పాటు చేస్తూ.. సరికొత్త విధానానికి నాంది పలికింది. ఐఫోన్‌ 13 సిరీస్‌లో ఐఫోన్‌ 13 మినీబీ ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మాక్స్‌లను మంగళవారం అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేసింది.  వీటితో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7, ఐప్యాడ్‌ మినీ, ఐప్యాడ్‌ 2021లనూ ఆవిష్కరించింది. ఇక ఈ ఫోన్‌లో ఫేస్‌ ఐడి సెన్సర్లకు తక్కువ స్థలం కేటాయించింది. ఫోన్‌ కెమేరాలో కొత్తగా సినిమాటిక్‌ మోడ్‌ ఉంది. డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌లో షూట్‌ చేయవచ్చని, మ్యాగ్‌సేఫ్‌ ఛార్జింగ్‌నూ ఇవి సపోర్ట్‌ చేస్తాయని యాపిల్‌ తెలిపింది. ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13లు 5.4బీ 6.1 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ తాజా ఏ15 బయానిక్‌ ప్రాసెసర్‌తో వచ్చాయి. ఐఫోన్‌ 12 ప్రోతో పోలిస్తే ఐఫోన్‌ 13 ప్రో బ్యాటరీ గంటన్నర పాటు, బీ 13 ప్రోమాక్స్‌ బ్యాటరీ రెండున్నర గంటలు ఎక్కువగా పనిచేయనుంది. అన్ని ఫోన్ల మెమొరీ 128 జిబి నుండి ప్రారంభమవుతుంది. దేశీయంగా ఈనెల 17 నుంచి ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చు.. 24 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్‌ 13 మినీ రూ.69,900, 13 రూ.79,900, 13 ప్రో రూ.1,19,900, 13 ప్రో మ్యాక్స్‌ రూ.1,29,900 నుంచి ప్రారంభమవుతాయి.

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7:  వీటి డిస్‌ప్లేను పూర్తిగా మార్చారు. కొత్త తెర పెద్దగా, మరింత టెక్స్ట్‌ను చూపించడానికి వీలుంది. పూర్తి స్థాయి కీబోర్డును సపోర్ట్‌ చేయనుంది. ఈ వాచ్‌లు అయిదు రంగుల్లో లభించనున్నాయి. 399 డాలర్ల (రూ.29,399) నుండి వీటి ధరలు ప్రారంభమవుతాయి.

కొత్త ఐప్యాడ్‌ మినీ, ఐప్యాడ్‌ 2021 :  8.3 అంగుళాల తెరతో 5జిని సపోర్ట్‌ చేసే ఐప్యాడ్‌ మినీకి యుఎస్‌బి -సి పోర్ట్‌తో పాటు అత్యాధునిక ఫీచర్స్‌ను అందించారు. 122 డిగ్రీల పాయింట్‌ ఆఫ్‌ వ్యూతో 12 ఎమ్‌పి అల్ట్రావైడ్‌ కెమెరా అమర్చారు. 4కే రికార్డింగ్‌ సామర్థ్యం ఉంది. ఐప్యాడ్‌ మినీ, ఐప్యాడ్‌ 2021లు రెండూ ఎ 13 బయానిక్‌ చిప్‌సెట్‌తో వచ్చాయి. దేశీయంగా ఐప్యాడ్‌ వైఫై మోడల్‌ రూ.30,900తోబీ వైఫైంసెల్యులార్‌ మోడల్స్‌ రూ.42,900తో ప్రారంభమవుతాయి.