Sep 27,2021 19:19

దుబాయ్ : విలియమ్స్ (43), శర్మ(21) ఆచితూచి ఆడుతూ విజయం దిశగా నడిపిస్తున్నారు. ఆఖరి రెండు ఓవర్లలో 6 పరుగులు చేయాల్సి ఉంది. 3వికెట్ల కోల్పోయి 18 ఓవర్లలో 159 పరుగులు చేసింది. 

- 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ నిలకడగా ఆడుతుంది. ఓపెనర్ గా ఆడిన జాసన్ అర్ధ సెంచరీతో (60) విజయానికి పునాదులు వేసింది. సాహ(18)దటి వికెట్ గా ఔట్ కాగా, జాసన్ రెండో వికెట్ గా ఔట్ అయ్యాడు. 3వ వికెట్ గా గార్గ్ డకౌట్ అయ్యాడు. 

- శాంసన్ అర్ధ సెంచరీ పూర్తి చేసిన తరువాత తన దూకుడు పెంచాడు. ఒకే ఓవర్ లో రెండు సిక్సర్లు కొట్టాడు. కేవలం 11 బంతుల్లో 38 బాదాడు. దీంతో శాంసన్ 52 బంతుల్లో 78పరుగులు (7 ఫోర్లు, 3 సిక్సర్ ) చేశాడు. లోమ్రోర్(25) తన సహకారాన్ని అందిస్తున్నాడు. దీంతో  ఆర్.ఆర్ - 153/3(18ఓవర్లు) చేరుకుంది. 

- బ్యాటింగ్ లో తనదైన శైలిలో సత్తా చాటుతున్న శాంసన్ 41 బంతుల్లో 50పరుగులు చేశాడు. దీనిలో 5 ఫోర్లు, 1 సిక్సర్ ఉంది. ఆర్.ఆర్  125/3(15.3ఓవర్లు)

- శాంసన్(46), లోమ్రోర్(12) ఆడుతున్నారు.  3వ వికెట్ గా స్టన్(4) రషీద్ బౌలింగ్ లో అబ్దుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్.ఆర్  113/3(15ఓవర్లు) 

- జైస్వాల్ 36 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. శాంసన్ (25), స్టన్ (1) ఆడుతున్నారు. ఆర్.ఆర్ - 68/2(9ఓవర్లు)

- రాజస్తాన్ రాయల్స్  లూయిస్ , జైస్వాల్ ఓపెనర్లుగా పంపింది. అయితే ప్రారంభంలోనే లూయిస్(6)భువనేశ్వర్ బౌలింగ్ లో సమద్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం మంచి ఫాంలో ఉన్న శాంసన్(8) బ్యాటింగ్ కు దిగాడు. జైస్వాల్ (23)ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్  - 37/1(5ఓవర్లు)

- ఐపిఎల్ - 2021 రెండవ సీజన్ లో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్తాన్ రాయల్స్. ఈ సీజన్ లో ఇరు జట్ల ప్రదర్సన పేలవంగా ఉంది. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికి వరకు 9మ్యాచులు ఆడగా, వాటిలో 4 మ్యాచుల్లో విజయాలు, 5 మ్యాచుల్లో ఓటమి పాలైంది. సన్ రైజర్స్ ఆడిన 9 మ్యాచులలో 8 ఓటములు, ఒక విజయం మాత్రమే ఉన్నాయి. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇరు జట్లు ఇప్పటివరకు 14మ్యాచుల్లో తలపడగా, తలో 7మ్యాచుల్లో గెలుపొందారు.

రాజస్తాన్‌ జట్టులో గాయంతో కార్తిక్‌ త్యాగి దూరమవగా.. మోరిస్‌, ఎవిన్‌ లూయిస్‌ తుది జట్టులోకి వచ్చారు. ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. వార్నర్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే స్థానాల్లో జేసన్‌ రాయ్‌, అభిషేక్‌ శర్మ, ప్రియమ్‌ గార్గ్‌ తుది జట్టులోకి వచ్చారు. గాయపడిన ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో సిద్దార్థ్‌ కౌల్‌ జట్టులోకి వచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తఫిజుర్ రహమాన్

ఎస్‌ఆర్‌హెచ్‌: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ