Mar 25,2023 22:54

ఇరిగేషన్‌ భూమిని పరిశీలించి మాట్లాడుతున్న సిపిఎం నాయకులు శేషబాబ్జి- సిపిఎం నాయకులు
ప్రజాశక్తి - కాకినాడరూరల్‌
వలస పాకల పంచాయతీ గంగరాజు నగర్లో ఇరిగేషన్‌ కాలువ గట్టు భూమిని కొంతమంది అధికార పార్టీ నాయ కులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి ప్రకటించారు. శనివారం ఆయన ఆక్రమణకు గురవుతున్న భూమిని సిపిఎం నాయకులతో కలసి సందర్శించి మాట్లాడారు. వలస పాకల పంచాయతీ గంగరాజు నగర్లో ఇరిగేషన్‌ కాలువ గట్టు భూమిని ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కుగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన ఆ భూమిని ఆక్రమించి ఇల్లు లేని పేదలకు పంచి ఇస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిం చుకోవాలని చూస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణ స్థలానికి రక్షణ కల్పించా లని అధికారులు కలిసినప్పుడు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కానీ అధికారులను కలిసి 15 రోజులు అయినా నేటికీ ఈ స్థలానికి రక్షణ మాత్రం కల్పించట్లేద న్నారు. ఈ క్రమంలోనే సిపి ఎం ఈ నెల 29న ఇల్లు లేని పేదలకు ఈ స్థలాన్ని పంచి ఇస్తుందనిన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, మలకా వెంకటరమణ పాల్గొన్నారు.