Nov 26,2021 08:24

న్యూఢిల్లీ : ఈశాన్య ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం వచ్చింది. భారత్‌-మయన్మార్‌ సరిహద్దుకు సమీపాన భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మణిపూర్‌, మిజోరాం, అసోం ప్రకంపనలు సంభవించాయి. కోల్‌కతా వరకు భూకంపం సంభవించినట్లు యూరోపియన్‌-మెడిటేరనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ (ఎఎంఎస్‌సి) వెబ్‌సైట్‌లో ఓ సాక్షి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తాను చూసిన అతి పొడవైన భూకంపాల్లో ఒకటని మిజోరాంలోని థెన్‌జాల్‌కు చెందిన వ్యక్తి పోస్టు చేశారు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు తూర్పున 183 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది. శుక్రవారం ఉదయం 5.15 గంటలకు భూకంపం వచ్చింది. సుమారు 5.53 గంటలకు మరోసారి భూమి కంపించింది.