
ప్రజాశక్తి-చీరాల: విద్యార్థులు చదువులను కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని అప్పుడే వారు ఉన్నత భవిష్యత్తు ఆధ్వర్యం వహిస్తారని రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ఐ బాబురావు అన్నారు. సోమవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈపురిపాలెం బైపాస్ రోడ్డు పక్కన కస్తూరిబా గాంధీ బాలికల కేంద్రీయ విద్యాలయ హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థులకు డాక్టర్ బాబురావు ఆధ్వర్యంలో డాక్టర్ షైనీ ప్రియాంక పర్యవేక్షణలో ఉచిత చర్మవ్యాధుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచి ఆహారం తీసుకుంటూ శరీర శుభ్రతను పాటించాలని తద్వారా రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు అన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అధికంగా ఉన్నాయని విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే నిర్వాహకులకు తెలియజేయాల న్నారు. అనంతరం చర్మ వ్యాధులు రాకుండా తీసుకోవలసిన పలు జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో చీరాల కృష్ణమూర్తి వలివేటి మురళీకృష్ణ, హాస్టల్ హెచ్‌ఎం సుజాత, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ డైరెక్టర్ పోలుదాసు రామకృష్ణ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.