Jun 11,2021 21:20

* 25% ప్రేక్షకులకు అనుమతి
పారిస్‌ : కరోనా వైరస్‌ కారణంగా 2020లో జరగాల్సిన యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. రోమ్‌ వేదికగా గ్రూప్‌ాఏలో ఉన్న ఇటలీాటర్కీ జట్లమధ్య జరిగే తొలి మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్లు మైదానంలో సాధన చేస్తున్న ఫొటోలను నిర్వాహకులు విడుదల చేశారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పోర్చుగల్‌ జట్టుకు క్రిస్టియానో రొనాల్డో సారథ్యం వహించనున్నాడు. టోర్నమెంట్‌లో ఆడే 24 జట్లను ఆరు గ్రూప్‌లు విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగేసి జట్లు ఉండగా.. లీగ్‌ అనంతరం అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నమెంట్‌కు సెవిల్లె, బాకు ఆతిథ్యమివ్వనుండగా.. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. రోమ్‌లోని స్టేడియో ఒలింపికోలో జరిగే మ్యాచ్‌లకు 25% ప్రేక్షకులకు అనుమతివ్వడంతో 16వేలమంది ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించనున్నారు.