
న్యూఢిల్లీ : దేశంలో జరిగే ఎన్నికల కోసం బ్యాలెట్‌కు బదులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం)లు వినియోగించడాన్ని దారి తీసిన ప్రజాప్రాతినిధ్య చట్టంలోని రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. వ్యక్తిగత హోదాలో న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇవిఎంలను వినియోగించేందుకు అవకాశం కల్పించిన ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61ని పార్లమెంట్ ఆమోదించలేదని శర్మ పిటిషన్లో పేర్కొన్నారు.