
న్యూఢిల్లీ : జానపద గాయకుడు యోగేష్ గాధ్విపై ఎస్‌సి, ఎస్‌టి చట్టం కింద కేసు నమోదైంది. గుజరాత్‌లోని కచ్‌జిల్లా భుజ్‌లో శనివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గన్న ఆయన కులాన్ని దూషించినట్లు పోలీసులు తెలిపారు. భుజ్‌లోని రాధాకృష్ణ నగర్‌లోని బాలికల వసతి గృహం 'భీమరత్న సామ్రాస్ కన్యా విద్యాలయం' ప్రారంభోత్సవం సదర్భంగా గాధ్వి ( యోగేష్‌బోక్సా) ఒక ప్రదర్శన ఇచ్చారు. గుజరాత్ సమ్రాస్ ఛత్రాలయ సొసైటీ ఈ హాస్టల్ భవనాన్ని నిర్మించింది. అట్టడుగు కులాల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా 2016లో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సాధికారిత విభాగం కింద ఈ గుజరాత్ సమ్రాస్ ఛత్రాలయ సొసైటీని స్థాపించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్, గుజరాత్ స్పీకర్ నింబెన్ ఆచార్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపి వినోద్ చవ్దా, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. స్థానిక దళిత హక్కుల కార్యకర్త విశాల్ గర్వా ఫిర్యాదు మేరకు గాధ్విపై ఈ కేసు నమోదైంది. ఈ కార్యక్రమంలో గాధ్వి దళిత వర్గానికి వ్యతిరేకంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలుచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన దళిత నేతలు స్టేజ్‌పైకి ఎక్కి గాధ్విని అడ్డుకున్నారని అన్నారు. తమ వర్గానికి చెందిన బాలికల వసతి గృహ ప్రారంభోత్సవంలో వారినే కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.