Jul 29,2021 13:25

రాంచీ : జార్ఖండ్‌లోని రోడ్డు ప్రమాదంలో మరణించిన జడ్డిది హత్య అని తేలింది. సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించగా...గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా టెంపోతో ఢ కొట్టి హత్య చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈఘటనపై బార్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ జార్ఖండ్‌ హైకోర్టుతో మాట్లాడానని చెప్పారు. ఈ సమయంలో జోక్యం తగదని అన్నారు. ఈ కేసు గురించి తెలుసుకుని..విచారిస్తామని అన్నారు. వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తి ఉత్తమ్‌ ఆనంద్‌ బుధవారం ఉదయం జాగింగ్‌ చేస్తుండగా...వెనుక నుండి వచ్చిన గుర్తు తెలియని టెంపో వాహనం బలంగా ఢ కొట్టడంతో అక్కడ పడిపోయారు. అటుగా వెళ్తున్న వ్యక్తి ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించారు. అయితే చనిపోయిందీ జడ్జి అని తెలియకపోవడంతో ఈ విషయం బయటకు రాలేదు. ఏడు గంటలకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించగా.. గాలింపు చర్యల్లో ఆసుపత్రిలో చనిపోయింది జడ్జి అని తేలింది. తొలుత ఇది రోడ్డు ప్రమాదం అని పోలీసులు భావించగా..సిసిటివి ఫుటేజ్‌లు పరిశీలిస్తే.. ప్రణాళిక ప్రకారమే టెంపోతో గుద్ది చంపేశారని తేలింది.
కాగా..ఈ హత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. దన్‌భాగ్‌లో పలు మాఫియా కేసులతో పాటు ఇటీవల ఇద్దరు గ్యాంగ్‌స్టర్లకు బెయిల్‌ నిరాకరించిన కేసులతో ఏమన్నా సంబంధాలున్నాయన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటివరకు ఆటో డ్రైవర్‌, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై బార్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని సుమోటో పరిగణించి విచారణ చేపట్టాలని కోరింది. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పందిస్తూ.. ఈ విషయంపై జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడానని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉందని, ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తున్నామని చెప్పారు.

                                                సిసిటివి ఫుటేజ్ లింక్ ి ఇదిగో