Sep 15,2021 21:20

నెల్లిమర్ల.. మాట్లాడుతున్న జెసి కిశోర్‌కుమార్‌

ప్రజాశక్తి-డెంకాడ : ఇంజినీర్లే జాతి ప్రగతికి మూలమని లెండి కళాశాల ప్రిన్సిపల్‌ వివి రామరెడ్డి తెలిపారు. లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీర్స్‌డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రాజెక్టు ఎక్స్పో, క్విజ్‌, వ్యాసరచన, పేపర్‌ ప్రజెంటేషన్‌, చిత్రలేఖనం, వినూత్న ఆలోచనలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపల్‌ టి.హరిబాబు, ఎవి పరాంకుశం, సమన్వయకర్త బి.శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.
'సెంచూరియన్‌'లో ఇంజినీర్స్‌ డే వేడుకలు
నెల్లిమర్ల :
సెంచూరియన్‌ యూనివర్సిటీలో బుధవారం ఇంజినీర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి జెసి కిశోర్‌కుమార్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని నూతన ఆవిష్కరణలు జరగాలన్నారు. వివిధ రంగాల శాస్త్రవేత్తలు పడ్డ శ్రమను గుర్తించాలన్నారు. ఆలోచనలు కార్యరూపం దాల్చినప్పుడు ఇంజినీర్‌ అవుతారని గుర్తుచేశారు. విశాఖపట్నం అపోలో ఆస్పత్రి సిఇఒ డాక్టర్‌ సమీముల్లా మాట్లాడుతూ సమాజంలో పెద్దలు, ఉపాధ్యాయులు విజ్ఞాన ఘనులని వారితో సమయం వెచ్చించి గడపాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ జిఎస్‌ఎన్‌ రాజు, రిజిస్ట్రార్‌ సి.వి.గోపినాథ్‌, శాంతమ్మ, డీన్లు రమణారావు, నరసింహాచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మోక్షగుండం ఇంజనీర్లకు ఆదర్శం
గంట్యాడ :
మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్లకు ఆదర్శమని పంచాయతీరాజ్‌ డిఇ ప్రసాదరావు అన్నారు. బుధవారం మండల కార్యాలయంలో విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ కవితి, ఎంపిడిఒ నిర్మలాదేవి, పిఆర్‌ ఎఇ కృష్ణమూర్తి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ సునీల్‌కుమార్‌, హౌసింగ్‌ ఎఇ జగన్మోహనరావు పాల్గొన్నారు.
విశ్వేశ్వరయ్యకు ఎమ్మెల్యే నివాళి
కొత్తవలస :
తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఇంజినీర్లు ఎమ్మెల్యేకు జ్ఞాపికను అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పిఆర్‌ డిఇ. సి.హెచ్‌.వెంకట నాయుడు, ప్రాజెక్టు డిఇ అల్లు చంద్రునాయుడు, ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ ఆర్‌.సన్యాసిరావు, పిఆర్‌ జెఇ వీరలక్ష్మి, హౌసింగ్‌ జెఇ సత్యనారాయణ, తహశీల్దార్‌ ఎస్‌.రమణరావు, ఎంపిడిఒ గంట వెంకటరావు, కొత్తవలస సర్పంచ్‌ మచ్చ రామస్వామి, వైసిపి నాయకులు కర్రి శ్రీను, పల్లా భీష్మ పొల్గొన్నారు.