Jan 25,2022 23:54

పోచా వరుణారెడ్డికి

ప్రజాశక్తి - కర్నూలు క్రైం: జైళ్ల శాఖ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ పోచా వరుణారెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ సేవా అవార్డు లభించింది. వరుణారెడ్డి ఆశాఖ ద్వారా అందించిన సేవలకుగాను ప్రభుత్వం ఈ అవార్డు ఆయనకు దక్కింది. 1992లో ఆయన ఆదోని డిప్యూటీ జైలర్‌గా ఉద్యోగంలో అడుగు పెట్టారు. 2007లో నందికొట్కూరులో విధులు నిర్వహిస్తూ జైలర్‌గా పదోన్నతి పొందారు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు 2010లో డిప్యూటీ సూరింటెండెంట్‌గా ప్రమోషన్‌ పొంది ఆరున్నర సంవత్సారాల కాలంలో రాష్ట్ర విభజన తర్వాత కూడ తెలంగాణలో దాదాపు ఒకటిన్నర సంవత్సరం దాకా( సీకా) లో స్టేట్‌ లెవెల్‌ ఆ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రిన్సిపల్‌ గా విధులు నిర్వహించారు. డిప్యూటీ సూపరిండెంట్‌ గా కర్నూలు జిల్లా జైలుకు బదిలీపై వచ్చారు. దాదాపు ఈ హోదాలో ఐదున్నరేళ్లు సేవలందించారు. 31 డిసెంబర్‌ 2021లో అడిషనల్‌ సూపరింటెండెంట్‌గా పదోన్నతిపొంది నూతనంగా ఏర్పాటు చేసిన కర్నూలు జైలులో పరిశ్రమ ఏర్పాట్లు, ఖైదీల సంక్షేమం, పచ్చదనం పరిశుభ్రత వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఈ అవార్డు దక్కిన సందర్బంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. జైళ్ల అభివృద్ది, ఖైదీల సత్ప్రవర్తన, సంక్షేమం పట్ల మరింత బాధ్యతతో దృష్టిసారించి పని చేస్తానని ఆయన తెలిపారు.