Jul 29,2021 22:08

మాట్లాడుతున్న డిఇఒ

మాట్లాడుతున్న డిఇఒ
జెడ్‌పి హైస్కూల్లో డిఇఒ తనిఖీ
ప్రజాశక్తి-బిట్రగుంట:మండలంలోని జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత బాలుర బాలికల పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాబార్డ్‌ కింద జరుగుతున్న నాడు -నేడు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రధానోపాధ్యాయులకు సూచనలిచ్చారు. పాఠశాల ఆవరణం విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆకర్షించే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఎంఇఒ జయంత్‌ బాబు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.