Oct 14,2021 18:03

ప్రజాశక్తి -కడప అర్బన్‌
జిల్లాలో పెండింగ్లో ఉన్న సచివాలయ హెల్త్‌ సెక్రటరీల సమస్యలపై జాయింట్‌ కలెక్టర్‌ సాయి కాంత్‌ వర్మ నుహొ కలిసేందుకు వెళ్లిన సిఐటియు నాయకులను అడ్డుకుని , ఇక్కడి నుంచి వెళ్ళిపొమ్మని మాట్లాడడం సమంజసం కాదని సిఐటియు జిల్లా కార్యదర్శులు రామమోహన్‌,హొ రామాంజులు అన్నారు.
గురువారం నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐటీయూ నాయకులు వ్యక్తిగత పనుల కోసం జేసి దగ్గరికి వెళ్లలేదన్న విషయం గమనంలో ఉంచుకొవాలన్నారు.హొగ్రామ వార్డు సచివాలయాల్లో హెల్త్‌ సెక్రటరీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నహొ సమస్యలపై చర్చించేందుకు గ్రామ వార్డు సచివాలయం అభివఅద్ధి అధికారిగా జెసిని కలిసేందుకు వెళ్లామన్నారు.హొసచివాలయ హెల్త్‌ సెక్రెటరీ ల సమస్యలను జేసీ సాయి కాంత్‌ వర్మకు వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నహొ సందర్భంలో సిఐటియు నాయకులు ఇక్కడికి రావడానికి వీల్లేదని మాట్లాడటం సరైంది కాదని వారన్నారు. కార్మిక, ఉద్యోగ సంఘాలలో చట్టాల్లో బయటివారు నాయకులుగా ఉండవచ్చని తెలియజేస్తోందన్నారు.ఈ విషయాన్ని జేసీ సాయి కాంత్‌ వర్మ కార్మిక చట్టాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.హొగతంలో అనేక సందర్భాల్లో ఇదే వైఖరితో జేసీ వ్యవహరించారన్నారు.ఈ వైఖరి మారకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని వారు తెలిపారు.