Apr 07,2021 22:42

కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పీడీసీసీబీ చైర్మన్‌ మాదాసి వెంకయ్య

ప్రజాశక్తి-శింగరాయకొండ: బింగినపల్లి సర్పంచ్‌ జెట్టి సుబ్బారెడ్డి మరణం గ్రామానికి తీరని లోటని వైసిపి కొండపి ఇన్‌ఛార్జి, పీడీసీసీబీ చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య అన్నారు. బింగినపల్లిలోని జెట్టి సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జెట్టి సుబ్బారెడ్డి పంచాయతీ ఎన్నికల్లో మండలాన్ని వైసిపికి ఏకగ్రీవంగా తీసుకువచ్చిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి మరణించడం ఎంతో బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి వైసిపి అండగా ఉంటుందని ఆయన అన్నారు. జెట్టి సుబ్బారెడ్డి కుమారుడు జెట్టి జానకిరామ్‌ రెడ్డిని, అన్న జెట్టి శంకర్‌రెడ్డిని పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో డాక్టర్‌ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కేశవరపు జాలిరెడ్డి, తాడిపర్తి చంద్రశేఖర్‌, సామంతుల రవికుమార్‌రెడ్డి, పామర్తి మాధవరావు, యువజన విభాగం అధ్యక్షులు శీలం రాము, నున్నా బ్రహ్మయ్య, ఎస్‌కె.కరీమ్‌, ఎస్‌కె.లియాఖత్‌, సవలం కోటేశ్వరరావు, దొడ్డా కరుణాకర్‌రెడ్డి, దొడ్డా మహీధర్‌ రెడ్డి, తాండ్రా రామమూర్తి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాపూరి ప్రభావతి, ఒడ్డేరు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యనమల మాధవి, నాదెండ్ల సూర్యప్రకాశరావు తదితరులు ఉన్నారు. అదే విధంగా తహశీల్దార్‌ ఎస్‌.ఉషారాణి, విఆర్‌ఒ సింహాద్రి, హనుమంతరావు, టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు డాక్టర్‌ నూకసాని బాలాజి, మాజీ సర్పంచ్‌ మద్దెల వెంకట నాగమాలతి ఉన్నారు.