Jul 29,2021 22:26

లేఅవుట్‌లను పరిశీలిస్తున్న వీరి చలపతిరావు

లేఅవుట్‌లను పరిశీలిస్తున్న వీరి చలపతిరావు
జగనన్న లేఅవుట్‌ల పరిశీలన
డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు
ప్రజాశక్తి కొడవలూరు:మండలంలోని మిగిలి ఉన్న గ్రామాల్లోనూ త్వరలోనే పట్టాల పంపిణీకి తయారు చేసుకోవాలని అధికారులకు డీసీఎంఎస్‌ వీరి చలపతిరావు సూచించారు. మండలంలోని గుండాలమ్మపాలెం, బసవయ్యపాలెం, చంద్రశేఖరపురంలలో సిద్ధమవుతున్న జగనన్న లే అవుట్‌లను గురువారం ఆయన మండల అధికారులతో కలిసి పరిశీలించారు. తొలివిడతలో పరిమిత గ్రామాల్లోనే పట్టాలు పంపిణీ చేసినందున రెండో విడతలో మిగిలిన అన్ని గ్రామాల్లో పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు తెలిపారు. కొన్ని గ్రామాల్లో స్వల్ప వివాదాల నేపథ్యంలో పంపిణీకి వాయిదా పడింది. ఆ సమస్యలు పరిష్కారమైనందున పట్టాలు సిద్ధం చేయాలని చెప్పారు గుండాలమ్మపాలెం లో పట్టాలు సిద్ధమై నందున శనివారం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు మిగిలిన గ్రామాల్లోనూ త్వరలోనే పంపిణీ చేసి వంద శాతం గ్రామాల్లో నివేశ స్థలాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు పేదలకు సకల సదుపాయాలతో ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం జగన్మోహన్‌ రెడ్డి స్వప్నమని ఆ కల సహకారం దిశగా అధికారులు అంతా కషి చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్‌ గంధం వెంకటశేషయ్య మండల ప్రత్యేక అధికారి ని పి సత్యవాణి తహసీల్దార్‌ ఈ. రమాదేవి ఎంపీడీవో ఎల్‌ జ్యోతి రెడ్డి హౌసింగ్‌ ఏఈ పీ.సురేష్‌ కుమార్‌ ఆర్‌ ఐలు జీ. మల్లికార్జున ఎన్‌. సురేష్‌ కుమార్‌ నాయకులు బెల్లం వెంకట నగేష్‌ నాయుడు జీ. మస్తానయ్య సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.