Mar 19,2023 22:01

విద్యార్థుల తల్లిదండ్రులకు చెక్కును అందజేస్తున్న జెసి ఆనంద్‌

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల ఆదివారం జరిగింది. జిల్లాలో 19,999 మంది విద్యార్థులు జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులు కాగా, విద్యార్థుల తల్లులు 18,232 మంది ఖాతాల్లో రూ.11.57 కోట్లు జమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరం నుంచి అధికారులు, విద్యార్థులు, తల్లులు హాజరయ్యారు. జిల్లాలో వెనుకబడిన కులాల సంక్షేమశాఖ కింద 12,876 మంది విద్యార్థులకు రూ.7.64 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ కింద 4,037 మంది విద్యార్థులకు రూ.1.43 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ కింద 2,200 మంది విద్యార్థులకు రూ.1.86 కోట్లు, ఒబిసిల సంక్షేమం కింద 650 మంది విద్యార్థులకు రూ.44.80 లక్షలు, కాపు కులాల సంక్షేమం కింద 306 మంది విద్యార్థులకు రూ.16.10 లక్షలు, ముస్లిం మైనారిటీ సంక్షేమం కింద 21మంది విద్యార్థులకు రూ.1.90 లక్షలు, క్రిస్టియన్‌ మైనారిటీ సంక్షేమం కింద 9మంది విద్యార్థులకు రూ.59 వేలు జమ అయ్యాయి. అలాగే పార్వతీపురం నియోజక వర్గంలో 5,578 మంది విద్యార్థులకు రూ.3.56 కోట్లు, సాలూరు నియోజక వర్గంలో 3,967 మంది విద్యార్థులకు రూ.2.30 కోట్లు, కురుపాం నియోజక వర్గం లో 5,322మంది విద్యార్థులకు రూ.2.88 కోట్లు, పాలకొండ నియోజక వర్గంలో 5,132 మంది విద్యార్థులకు రూ.2.83 కోట్లు అందాయి. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఓ.ఆనంద్‌, జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి ఎండి గయాజుద్దీన్‌, జిల్లా బిసి సంక్షేమ, సాధికారిత అధికారి ఎస్‌.కృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ పర్యవేక్షకులు నీలాద్రి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.