Feb 06,2023 20:24

అశోక్‌ సమర్పణ కుమార్‌ను అభినందిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా ఖజానా, లెక్కల అధికారిగా రుద్రపాటి అశోక్‌ సమర్పణ కుమార్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లా ఖజానా అధికారిగా ఉన్న ఎస్‌ఆర్‌కె గణేష్‌ అనారోగ్య కారణాలతో సెలవు పెట్టడంతో, ఉమ్మడి జిల్లా ఖజానా అధికారిగా అశోక్‌ సమర్పణ కుమార్‌ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఎపిటిఎస్‌ఎ నాయకులు, ఖజానా కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సహాయ ఖజానా అధికారులు నితిన్‌, ఆదిత్య, ఎపిటిఎస్‌ఎ రాష్ట్ర కార్యదర్శి పద్మనాభం, జిల్లా కార్యవర్గ సభ్యులు సరేష్‌, సంతోషి, రామకష్ణ, చంద్రశేఖర్‌, నాగమునిరెడ్డి పాల్గొన్నారు.