Nov 24,2022 19:34

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి - డోన్‌

ఈనెల 26, 27 తేదీల్లో బనగానపల్లె పట్టణంలో జరగనున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి తెలుగు విజయకుమార్‌, అధ్యక్షులు అశోక్‌లు కోరారు. గురువారం స్థానిక పాతపేట జడ్పీ హైస్కూల్‌ నందు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభల పోస్టర్లను జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి మాణిక్యం శెట్టి, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌, విజరు, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు షమీం బేగం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలో విద్యారంగ సమస్యలపై చర్చించి, భవిష్యత్‌ ఉద్యమాలకు ప్రణాళికలు తయారు చేసుకొనేందుకు విద్యావేత్తలు, అభ్యుదయవాదులు సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఐ కోశాధికారి ఇర్ఫానా బేగం, ఉదరు, ఐద్వా నాయకులు దేవి, గౌసియా, షబానా, మాదేవి పాల్గొన్నారు.