Nov 24,2022 19:35

ఆటో జాతను జెండా ఊపి ప్రారంభిస్తున్న వ్యకాసం జిల్లా అధ్యక్షులు ఆర్‌ ఈశ్వరయ్య, నాయకులు

జిల్లా మహాసభలు జయప్రదం చేయండి : వ్యకాసం

ప్రజాశక్తి - బేతంచెర్ల

మండల కేంద్రంలో జరుగు వ్యవసాయ కార్మిక సంఘం రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్‌ ఈశ్వరయ్య, సీనియర్‌ నాయకుడు వై ఎల్లయ్య కార్మికులను, ప్రజలను వారి కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు జయప్రదం చేయాలని గురువారం నాడు బేతంచర్లలో ఆటో జాతను వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్‌ ఎన్‌ హైమావతి వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఊపి జాతను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులకు వారి కుటుంబాలకు ఉపాధి, విద్య, వైద్యం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమై అయ్యాయన్నారు.
రెండు రోజులపాటు జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని వారన్నారు. మహాసభల సందర్భంగా మొదటి రోజు జరుగుతున్న ర్యాలీ బహిరంగ సభకు. ఉపాధి కూలీలు, ప్రజలు కార్మికులు, అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు సిఐటియు కార్మికులు ఎస్‌ఏ కలాం, స్వామి నాయుడు, రాజబాబు, వెంకటరమణ, నర్సింహులు, నాగరాజు, వెంకటసుబ్బయ్య, మాలిక్‌ బాషా, రామళ్లకోట బాష, శ్రీనివాసులు, మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.